రమ్మీ కార్డ్ గేమ్ ఆడటం ఎలా - రమ్మీ రూల్స్ & రమ్మీ ఆడటానికి గైడ్

రమ్మీ కార్డ్ గేమ్ ఆడటం ఎలా: రమ్మీ నియమాలను తెలుసుకుని ప్రారంభిద్దాం

రమ్మీ అనేది మొత్తం ఇద్దరు జోకర్లు ఉండే రెండు డెక్ ల కార్డులతో ఆడే ఒక ఆట. రమ్మీ ఆట గెలవాలంటే ఇచ్చిన రెండు పైల్స్ నుండి ఏరుకోవడం మరియు ఇచ్చివేయడం ద్వారా ఒక చెల్లే డిక్లరేషన్ ఇవ్వాలి. ఒక పైల్ లో ప్లేయర్ తాను తీసుకుంటున్న కార్డ్ ను చూడలేరు, మరొకటేమో ప్లేయర్లు డిస్కార్డ్ చేసిన కార్డులు ఉండే ఓపెన్ డెక్. ఒక రమ్మీ కార్డ్ గేమ్ గెలవాలంటే ప్లేయర్లు కార్డులను చెల్లే సీక్వెన్సులు మరియు సెట్లలో అమర్చాలి.

how to play rummy

రమ్మీలో ప్రతి సూట్ ర్యాంకులో కార్డులు క్రింది నుండి పైకి వచ్చే కొలది ఆస్, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, జాక్, క్వీన్ మరియు కింగ్ గా ఉంటాయి. ఆస్, జాక్, క్వీన్ మరియు కింగ్ ఒక్కొక్కటి 10 పాయింట్లు కలిగి ఉంటాయి. మిగిలిన కార్డులు వాటి ముఖ విలువనే వాటి విలువగా కలిగి ఉంటాయి. ఉదాహరణకు, 5 కార్డు, 5 పాయింట్లను కలిగి ఉంటుంది.

రమ్మీలో ఉన్న లక్ష్యం

13 కార్డులను ఒక చెల్లే సెట్లుగా మరియు సీక్వెన్సులుగా అమర్చటమే రమ్మీ కార్డ్ గేమ్ లో ఉండే లక్ష్యం. గేమ్ గెలవాలంటే మీరు కనీసం 2 సీక్వెన్సులు చేయాల్సి ఉంటుంది, అందులో ఒకటి ప్యూర్ సీక్వెన్స్ అయి ఉండాలి, మరొకటి ఏదేని చెల్లే సీక్వెన్స్ లేదా సెట్ అయి ఉండాలి. ఒక ప్యూర్ సీక్వెన్స్ చేయకుండా మీరు ఒక చెల్లే రమ్మీ డిక్లరేషన్ చేయలేరు ఇది రమ్మీలో ఒక ముఖ్యమైన నిబంధన.

rummy rules

సీక్వెన్సులను ఎలా ఏర్పరచాలి?

రమ్మీలో, ఒక సీక్వెన్స్ అంటే ఒకే సూట్ లోని మూడు లేదా అంతకంటే ఎక్కువ వరుస సంఖ్యల కార్డుల గ్రూపు. రెండు రకాల సీక్వెన్సులు ఏర్పడాలి; ఒకటి ప్యూర్ సీక్వెన్స్ మరియు ఒకటి ఇంప్యూర్ సీక్వెన్స్. రమ్మీ గేమ్ గెలవడానికి మీకు మీ రమ్మీ హ్హ్యాండ్ లో కనీసం ఒక ప్యూర్ సీక్వెన్స్ చేయడం అవసరం.

ప్యూర్ సీక్వెన్స్

ఒక ప్యూర్ సీక్వెన్స్ అంటే ఒకే సూట్ లోని మూడు లేదా అంతకంటే ఎక్కువ వరుస సంఖ్యల కార్డుల గ్రూపు. ఒక రమ్మీ కార్డ్ గేమ్ లో ప్యూర్ సీసీక్వెన్స్ ను ఏర్పాటు చేయుటకు, ఒక ప్లేయర్ ఎటువంటి జోకర్ ను కానీ లేదా వైడ్ కార్డ్ ను కానీ ఉపయోగించకూడదు.

ప్యూర్ సీక్వెన్స్ కు ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఉవ్వబడ్డాయి.

  1. 5 6 7 (మూడు కార్డులతో ఏర్పడ్డ ప్యూర్ సీక్వెన్స్; ఇందులో జోకర్ కానీ వైల్డ్ కార్డ్ కానీ లేదు)
  2. 3♠ 4♠ 5♠ 6♠ (నాలుగు కార్డులతో ప్యూర్ సీక్వెన్స్.. ఇందులో జోకర్ మరియు వైల్డ్ కార్డులను ఉపయోగించింది లేదు.)

ఇంప్యూర్ సీక్వెన్స్

ఇంప్యూర్ సీక్వెన్స్ అంటే ఒకే సూట్ లోని ఒకటి లేదా అంతకంటే ఎక్కువ జోకర్ కార్డులను ఉపయోగించిన మూడు లేదా అంతకంటే ఎక్కువ వరుస కార్డుల గ్రూపు.

ఒక ఇంప్యూర్ సీక్వెన్స్ ఎలా ఏర్పడుతుందో చూపించే కొన్ని ఉదాహరణలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.

  1. 6 7 Q♠ 9 (ఇక్కడ 8 స్థానంలో ఒక ఇంప్యూర్ సీక్వెన్స్ ను ఏర్పరచుటకు Q♠ ను ఉపయోగించడం జరిగింది.)
  2. 5♠ Q 7♠ 8♠ PJ ( 6♠ స్థానంలో Q ను వైల్డ్ జోకర్ గా మరియు 9♠ స్థానంలో ప్రింటెడ్ జోకర్ ను ఉంచడం జరిగింది.)

సెట్లను ఎలా ఏర్పరచాలి?

ఒక సెట్ అంటే వేర్వేరు సూట్లకు చెందిన ఒకే విలువ కల మూడు లేదా అంతకన్నా ఎక్కువ కార్డుల గ్రూపు. మీరు సెట్లను ఏర్పరచేటప్పుడు, వైల్డ్ కార్డ్ మరియు జోకర్లను ఉపయోగించవచ్చు.

సెట్స్ కు ఉదాహరణ

  1. A A♣ A (ఈ సైట్ లో ఏస్ లన్నీ వేర్వేరు సూట్లకు చెందినవి, ఇవి ఒక చెల్లే సైట్ ను ఏర్పరుస్తున్నాయి.)
  2. 8 8♣ 8♠ 8 (రమ్మీ సెట్, వేర్వేరు సూట్లకు చెందిన నాలుగు 8 కార్డులచే ఏర్పడింది.)
  3. 9 Q♠ 9♠ 9 (Q♠ కార్డు వైల్డ్ జోకర్ గా 9♣ స్థానంలో ఉపయోగించబడుతుంది.)
  4. 5 5♣ 5♠ PJ (ప్రింటెడ్ జోకర్ 5 స్థానంలో ఉపయోగించబడి ఒక సెట్ తయారైంది.)
  5. 5 5♣ Q♠ PJ (ఇక్కడ 5♠ స్థానంలో Q♠ ను వైల్డ్ జోకర్ గా మరియు 5♥ స్థానంలో ప్రింటెడ్ జోకర్ ను ఉపయోగించడం జరిగింది.)
  6. 5 5♣ PJ Q Q♠ (ఇది 5 కార్డుల సెట్, ఇందులో ప్రింటెడ్ జోకర్ మరియు Q లను 5♠ 5 ల స్థానంలోనూ మరియు 13 కార్డుల గ్రూపింగ్ ను పూర్తిచేయుటకు వైల్డ్ జోకర్ Q♠ ను ఉపయోగించడం జరిగింది.)

ఒక సోదాహరణ: 2 3 4 5| 5♣ 6♣ 7♣ 8♣ | 5 5♣ PJ Q Q♠ (13 కార్డుల గ్రూపింగ్ ను మరియు చెల్లే డిక్లరేషన్ ను ఏర్పరచడానికి 5 కార్డుల సెట్ ను ఏర్పరచడం జరిగింది.)

గమనిక: సైట్ ను వేర్వేరు సూట్లకు చెందిన ఒకే కార్డులతో ఏర్పాటుచేయాలి) అయితే, ఒకే సూట్ కు చెందిన రెండు లేదా అంతకన్నా ఎక్కువ కార్డులను ఉపయోగించలేరు.. ఇది చెల్లని డిక్లరేషన్ గా పరిగణించబడుతుంది. ఇంకా, ఒక సెట్లో 4 కంటే ఎక్కువ కార్డులు ఉండవచ్చు. కాబట్టి, మీ వద్ద 4 కార్డుల సెట్ ఉండి అదనపు జోకర్ ను ఉపయోగిస్తున్నట్లయితే, మొత్తంగా అది ఒక 5 కార్డుల చెల్లే సైట్ ను ఏర్పరుస్తుంది. ఏ మాత్రం సమయం తీసుకోకుండా హ్యాండ్ లో 13 కార్డులు ఉండాలి.

చెల్లని సైట్ కు ఉదాహరణ

  1. Q Q Q (ఒకే సూట్ కు చెందిన రెండు Q లు దీనిని ఒక చెల్లని సెట్ గా చేస్తున్నాయి.)
  2. 7♠ 7 7 7♠ Q (ఇందులో ఒకే సూట్ కు చెందిన రెండు 7 స్పేడ్లు ఉన్నాయి. ఐదవ కార్డుగా వైల్డ్ కార్డ్ Q చెల్లేదే అయినప్పటికీ రెండు 7♠ లను కలిగి ఉండటం దీనిని చెల్లని సెట్ గా చేస్తుంది.)

రమ్మీ కార్డ్ గేమ్ ఆడటం ఎలా?

ప్రారంభం నుండి చివరి వరకు ఆట ఎలా ఆడాలో తెలుసుకోవడానికి ఈ సులభ రమ్మీ నియమాలు మరియు సూచనలను అనుసరించండి:

  1. 2 డెక్ ల కార్డులతో 2 నుండి 6 గురు ప్లేయర్ల మధ్య రమ్మీ కార్డ్ గేమ్ ఆడతారు. ప్రతి ప్లేయర్ 13 కార్డులతో ఆడతారు. ఒక కార్డు ఆటలో వైల్డ్ జోకర్ లేదా జోకర్ కార్డుగా యాధృచ్ఛికంగా ఎంపిక చేయబడుతుంది.
  2. చేతిలో ఉన్న 13 కార్డులతో చెల్లే సెట్లు మరియు సీక్వెన్స్ లను రూపొందించడానికి ప్లేయర్ కార్డులను తీసుకోవడం లేదా ఇచ్చివేయడం చేయాలి, ఇక్కడ వైల్డ్ జోకర్ లేదా డెక్ యొక్క ప్రింటెడ్ జోకర్ ను కూడా ఇంప్యూర్ సీక్వెన్స్ మరియు సెట్ లను తయారు చేయడానికి ప్లేయర్ ఉపయోగించవచ్చు.
  3. ఇండియన్ రమ్మీ నిబంధనల ప్రకారం, 13 కార్డులను చెల్లే 1 ప్యూర్ సీక్వెన్స్ తో సహా 2 సీక్వెన్స్ లలో మరియు కొన్ని గ్రూపులుగా (సీక్వెన్సులు లేదా సెట్ లు) అమర్చిన తర్వాత, ఆ ప్లేయర్ డిక్లరేషన్ చేసి ఆట గెలవవచ్చు.


రమ్మీ కార్డ్ గేమ్ గెలవడానికి చిట్కాలు

రమ్మీ నిబంధనలు తెలుసుకోవడంతో పాటు ఏకాగ్రతతో జాగ్రత్తగా ఆడటం కూడా ముఖ్యము. మీరు రమ్మీ గేమ్ గెలిచి మీ పోటీ దారుల కంటే ముందడుగులో ఉండటానికి కొన్ని చిట్కాలు ఇవ్వబడ్డాయి.

  • గేమ్ ప్రారంభంలోనే ప్యూర్ సీక్వెన్స్ ను ఏర్పాటుచేయండి. ఒక ప్యూర్ సీక్వెన్స్ చేయకుండా ప్లేయర్ రమ్మీ డిక్లరేషన్ చేయలేరు.
  • ఆస్, జాక్, క్వీన్ మరియు కింగ్ వంటి అధిక పాయింట్లతో కార్డులను వదిలించుకోవాలి. వీటి స్థానే జోకర్ లేదా వైల్డ్ కార్డులను తీసుకోవాలి. అది ఒకవేళ మీరు గేమ్ ఓడిపోతే అది మీ పాయింట్ లోడ్ ను తగ్గిస్తుంది.
  • వీలైనంత వరకు వదిలించుకున్నవి ఉండే కుప్ప నుండి తీసుకోవడాన్ని నివారించండి. అది మీరు ఏర్పరచాలని చూస్తున్న హ్హ్యాండ్ ను గురించి తెలిసేలా చేస్తుంది.
  • స్మార్ట్ కార్డుల కోసం చూడండి ఉదాహరణకు, ఏదేని సూట్ కు చెందిన 7 ను అదే సూట్ కు చెందిన 5 మరియు 6 లతోనూ, 8 మరియు 9 లతోనూ జతగా అమర్చవచ్చు.
  • రమ్మీలో జోకర్లు ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. అధిక విలువ కార్డుల స్థానంలో వాఇని ఉపయోగించే ప్రయత్నం చేయండి. గుర్తుంచుకోండి, జోకర్ మరియు వైల్డ్ కార్డులను ప్యూర్ సీక్వెన్స్ లను ఏర్పరచడానికి ఉపయోగించలేము.
  • మీరు ఒక డిక్లరేషన్ చేయడానికి సిద్ధమైనప్పుడు, మీ కార్డులను ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకున్న తర్వాత బటన్ నొక్కండి. మీరు చేసే ఒక చెల్లని డిక్లరేషన్ వలన మీరు గెలవాల్సిన గేమ్ కూడా పూర్తిగా నష్టపోవచ్చు.

రమ్మీ నిబంధనల్లో సాధారణంగా ఉపయోగించే సాధారణ పదజాలం

ప్రతి ప్లేయర్ తాను ఆడటానికి ముందు నేర్చుకోవాల్సిన ఇండియన్ రమ్మీ గురించిన కొన్ని సాధారణ పదాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.

రమ్మీ టేబుల్ అంటే ఏమిటి?

ఇది రమ్మీ గేమ్ ఆడే టేబుల్. ప్రతి రమ్మీ టేబుల్ వద్ద రెండు నుండి ఆరుగురు ప్లేయర్లు కూర్చోవచ్చు.

జోకర్ మరియు వైల్డ్ కార్డులు అంటే ఏమిటి?

ప్రతి రమ్మీ డెక్ లో గేమ్ ఆరంభంలో ఒక ప్రింటెడ్ జోకర్ మరియు ఒక వైల్డ్ కార్డులను యాధృచ్ఛికంగా ఎంచుకుంటారు. ఈ రెండు రకాల కార్డుల పాత్ర సమానం. సెట్లను, ఇంప్యూర్ సెట్లను చేయడానికి జోకర్లను ఉపయోగించవచ్చు. గ్రూపులను ఏర్పరచేటప్పుడు కావాల్సిన కార్డు స్థానంలో జోకర్ ను ఉపయోగించవచ్చు. రమ్మీ గేమ్ లో ఇదొక చెల్లే అమరిక.

డ్రా(ఏరుకోవడం) మరియు డిస్కార్డ్ (విడిచిపెట్టడం) అంటే ఏమిటి?

అన్ని రమ్మీ గేమ్ లలో ప్రతి ప్లేయర్ 13 కార్డులతో వ్యవహరించాల్సి ఉంటుంది. అదనంగా, ప్రతి ప్లేయర్ కార్డులను ఎంచుకునేందుకు 2 స్టేక్స్ ఉంటాయి, వీటిలో నుండి కార్డులను డ్ర చేసుకోవచ్చు. ఒకసారి ఒక ప్లేయర్ కార్డును డ్రా చేసుకున్నతర్వాత, అతడు ఒక కార్డును విడిచిపెట్టాలి - దీనినే డిస్కార్డింగ్ అంటారు. ప్లేయర్ పైకి కనిపించని, ఇంకా చూడని కార్డులలోనుండి కానీ పైకి కనిపిస్తున్న వదిలించుకున్న కార్డులలోనుండి కానీ కార్డులను ఏరుకోవచ్చు. తన వంతు వచ్చినప్పుడు ఒక ప్లేయర్ గేమ్ ను డ్రాప్ చేసుకోవాలనుకోవచ్చు. అయితే, గేమ్ ను కార్డును డ్రా చేసుకోక ముందే డ్రాప్ చేయాలి.

కార్డులను సార్టింగ్ చేయడమంటే ఎలా?

గేమ్ ప్రారంభంలోనే కార్డులను సార్టింగ్ చేయాలి. ఇది మీ సెట్లు మరియు సీక్వెన్సులలో కార్డులు కలిసే సంభావ్యతను తగ్గించడంలో సహాయపడటానికి మీ కార్డులను అమర్చేందుకు ఇది జరుగుతుంది. ఒక్కసారి, కార్డులు డిస్ప్లే చేయబడిన తర్వాత, సార్ట్ బటన్ క్లిక్ చేసి ఆటను మొదలు పెట్తవచ్చు.

డ్రాప్ అంటే ఏమిటి?

ఒక ప్లేయర్ టేబుల్ ను రమ్మీ ఆట మధ్యలో లేదా ప్రారంభంలో విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నప్పుడు దానిని డ్రాప్ అంటారు. ఇది వ్యక్తిగత నిర్ణయంచే గేమ్ నుండి వైదొలగటం. మొదటి డ్రాప్=20 పాయింట్లు; మిడిల్ డ్రాప్= 40 పాయింట్లు మరియు లాస్ట్ డ్రాప్ కు గరిష్టంగా 80 పాయింట్ల వరకు నష్టపోతారు.

పూల్ రమ్మీ అయితే, ఎవరైనా ప్లేయర్ 101 పూల్ లో డ్రాప్ అయితే, స్కోరు 20 ఉంటుంది ఒకవేళ 201 లో డ్రాప్ అయితే డ్రాప్ స్కోర్ 25 గా ఉంటుంది. బెస్ట్ ఆఫ్ 2 మరియు బెస్ట్ ఆఫ్ 3 ఆడే ఒక గేమ్ లో, డ్రాప్ అనుమతించబడదు.

క్యాష్ టోర్నమెంట్లు అంటే ఏమిటి?

క్యాష్ టోర్నమెంట్లు అంటే నిజమైన క్యాష్ కొరకు ఆడేవి మరియు ఇవి నిజమైన క్యాష్ ప్రైజ్ లను( రూ.లలో) కలిగి ఉంటాయి. ఈ టోర్నమెంట్లు 24x7 జరుగుతూనే ఉంటాయి మరియు నాకౌట్ విధానంలో జరుగుతాయి.. ఏవైనా క్యాష్ గేమ్ ను ఆడటానికి, ప్లేయర్ తన రమ్మీసర్కిల్ ఖాతాకు డబ్బును యాడ్ చేయాలి.

నేను ఒక టోర్నమెంట్లో చేరడమెలా?

టాప్ నేవిగేషన్ ప్యానెల్ లోని ‘టోర్నమెంట్స్’ కు వెళ్ళండి. ఇప్పుడు, మీరు ఆడాలనుకుంటున్న టీర్నమెంట్ రకాన్ని సెలక్ట్ చేయండి. సంబంధిత టోర్నమెంట్ జాబితాలో, మీరు చేరాలనుకుంటున్న ఏదైనా ఓపెన్ టోర్నమెంటుపై క్లిక్ చేయండి. చివరగా, టోర్నెమెంట్ డిటెయిల్స్ క్రింద ‘జాయిన్ దిస్ టోర్నమెంట్’ అనే బటన్ ను క్లిక్ చేయండి.

చెల్లని డిక్లరేషన్ అంటే ఏమిటి?

కార్డులు చెల్లే సీక్వెన్సులలో లేదా సెట్లలో లేకుండా ఒక ప్లేయర్ డిక్లరేషన్ బటన్ ను క్లిక్ చేసినప్పుడు అది చెల్లని డిక్లరేషన్ అవుతుంది. అందువలన, ప్లేయర్ గేమ్ ను ఓడిపోయి పోటీదారుడు విజేతగా ప్రకటించబడతారు.

రమ్మీ ఆడేటప్పుడు ప్లేయర్లు చేసే కొన్ని సాధారణ చెల్లని డిక్లరేషన్లు ఇవ్వబడ్డాయి:

  • చెల్లని సెట్లతో కూడిన తప్పుడు డిక్లరేషన్

    ఉదాహరణ 1: 10♠ 10♠ 10 10♣ Q

    ఒక సెట్లో ముడు లేదా అంతకన్నా ఎక్కువ కార్డులు ఉండవచ్చు, అయితే వేర్వేరు సూట్లకు చెందిన ఒకే విలువ కల కార్డులతో ఒక సెట్ ఏర్పడుతుంది. ఇటువంటి పరిస్థితిలో, వైల్డ్ జోకర్ ( క్వీన్ లేదా హార్ట్స్) కార్డ్ జోడించబడి అది ఐదవ కార్డు అవుతుంది, ఇది నిబంధనల ప్రకారం చెల్లేదే, అయితే ఒకే సూట్ కు చెందిన రెండు కార్డులను కలిగి ఉండే గ్రూపు దీనిని తప్పుడు డిక్లరేషన్ గా చేస్తుంది.

    ఉదాహరణ 2: K K K

    ఈ సెట్లో, కనీస పరిమితిలో ఉండే 3 కార్డులు ఉన్నాయి. అంతేకాక, ఒక సెట్ అంటే అందులో వేర్వేరు సూట్లకు చెందిన ఒకే ముఖ విలువలు కల కార్డులు ఉండాలి. ఒక సెట్ ఒకే సూట్ కు చెందిన కార్డులను ఒకటి కంటే ఎక్కువ కలిగి ఉండకూడదు. ఈ ఉదాహరణలో, ఒకే సూట్ కు చెందిన రెండు కార్డులను సెట్ కలిగి ఉంది కావున అదే దీనిని తప్పుడు డిక్లరేషన్ గా అవ్వడానికి కారణమవుతుంది.

  • చెల్లని సీక్వెసులతో కూడిన తప్పుడు డిక్లరేషన్

    ఉదాహరణ 1: 10♠ 10 10 10♣ | 5♠ 5 5 | 6♠ 6 6♣ | 9 9 జోకర్

    ఒక చెల్లే డిక్లరేషన్ కు 2 సీక్వెన్సులు అవసరము, ఇందులో ఒకటి ప్యూర్ సీక్వెన్సుగానూ అంటే జోకర్ లేకుండా ఉండే సీక్వెన్సుగానీ మరొకటి జోకర్ తో లేదా జోకర్ లేకుండా ఉండే ఇంప్యూర్ సీక్వెన్స్ గానూ ఉండాలి. అయితే, ఇచ్చిన ఉదాహరణలో ఏ సీక్వెన్సు కూడా దానిని చెల్లని డిక్లరేషన్ గా చేసేదిగా లేదు.

    ఉదాహరణ 2: K K♠ K | 6 7 జోకర్ | 9♠ 10♠ J♠ జోకర్ | 5♠ 5 5

    ఒక చెల్లే డిక్లరేషన్ కు 2 సీక్వెన్సులు తప్పనిసరి, ఇందులో ఒకటి ప్యూర్ సీక్వెన్సుగానూ అంటే జోకర్ లేకుండా ఉండే సీక్వెన్సుగానీ మరొకటి జోకర్ తో లేదా జోకర్ లేకుండా ఉండే ఇంప్యూర్ సీక్వెన్స్ గానూ ఉండాలి. ఈ ఉదాహరణ 2 సీక్వెన్సులు ఉన్నాయి కానీ, రెండూ ఇంప్యూర్ సీక్వెన్సులే, అనగా ఒకటి జోకర్ తో కూడిన సీక్వెన్స్ ఉండగా మరొకటి ప్యూర్ సీక్వెన్స్ గా లేదు అని తెలియజేస్తుంది. మీరు డిక్లరేషన్ చేయడానికి ముందు మీరు ప్యూర్ సీక్వెన్సును ఏర్పాటు చేసి ఉండటం తప్పనిసరి.

    ఉదాహరణ 3: Q Q♠ Q | 6 7 8 9 | 5♠ 5 5 | 10♠ 10 10

    రమ్మీ కార్డ్ గేమ్ కు సీక్వెసులు చాలా ముఖ్యము మరియు గేమ్ గెలవాలంటే మీరు కనీసం 2 సీక్వెన్సులు చేయాల్సి ఉంటుంది, అందులో ఒకటి ప్యూర్ సీక్వెన్స్ అయి ఉండాలి, మరొకటి ప్యూర్ లేదా ఇంప్యూర్ సీక్వెన్స్ అయి ఉండాలి. ఈ ఉదాహరణలో, ఒక ప్యూర్ సీక్వెన్స్ ఉంది, అయితే రెండవ సీక్వెన్సు మాత్రం ఏర్పడలేదు కావున అది చెల్లని డిక్లరేషన్ అవుతుంది.

ఉపయోగకర ఛార్ట్ - రమ్మీ ఆడటం ఎలా మరియు చెల్లే రమ్మీ డిక్లరేషన్ కొరకు రమ్మీ మార్గదర్శకాలు:

rummy winning sets

 

13 కార్డులతో వ్యవహరించేటప్పుడు అనుసరించాల్సిన హ్యాండీ డిక్లరేషన్లు:

ప్యూర్ సీక్వెన్స్

ఇంప్యూర్ సీక్వెన్స్

సెట్ 1 & సెట్ 2
తప్పనిసరి గా చేయాల్సినవి తప్పనిసరి కానివి (కనీసం 2 సీక్వెన్సుల ఆవశ్యకతను నెరవేర్చడానికి దీనిని చేయవచ్చు) తప్పనిసరి కానిది
(13 కార్డుల చెల్లే గ్రూపింగ్ కొరకు చేయవచ్చు)
3 లేదా అంతకన్నా ఎక్కువ కార్డులతో చేయబడుతుంది. 3 లేదా అంతకన్నా ఎక్కువ కార్డులతో చేయబడుతుంది. 3 లేదా 4 లతో జోకర్ లేకుండా చేయాల్సినది.
లేదా

3, 4 అంతకన్నా ఎక్కువ కార్డులతో జోకర్ తో చేయవచ్చు.
ఒకే సూట్ కు చెందిన కార్డులు సీక్వెన్షియల్ క్రమంలో ఒకే సూట్ కు చెందిన కార్డులు సీక్వెన్షియల్ క్రమంలో వైల్డ్ కార్డ్ జోకర్ లేదా ప్రింటెడ్ జోకర్ తో ఒకే విలువ కల వేర్వేరు సూట్ లకు చెందిన కార్డులు Q (2 ఒకే రంగుకు చెంది వేర్వేరు సూట్లకు చెందిన కార్డులను ఉపయోగించవచ్చు. ఉదా - 5♠ 5 5).
జోకర్ లేదా వైల్డ్ కార్డును ఉపయోగించలేరు  జోకర్ లేదా వైల్డ్ కార్డును ఉపయోగించవచ్చు జోకర్ లేదా వైల్డ్ కార్డును ఉపయోగించవచ్చు  

 

రమ్మీలో 13 కార్డులను డిక్లేర్ చేయుటకు పై నిబంధన ప్రకారం సాధ్యమయ్యే కాంబినేషన్లు:


rummy valid declaration

  1. 4 కార్డులు ఉండే ఒక ప్యూర్ సీక్వెన్స్
  2. 3 కార్డులు ఉండే ఒక ఇంప్యూర్ సీక్వెన్స్, ఇందులో 8♣ ఒక వైల్డ్ జోకర్
  3. 3 కార్డులు ఉండే "సెట్ 1" ఉంటుంది
  4. 3 కార్డులతో పాటు "ప్రింటెడ్ జోకర్" ఉండే "సెట్ 2" ఉంటుంది

13 కార్డ్ గేమ్ నిబంధనల కొరకు హ్యాండీ పిడిఎఫ్ ను డౌన్లోడ్ చేయండి:: "PDF ను ఇప్పుడే డౌన్లోడ్ చేయండి"

ఇండియన్ రమ్మీ నిబంధనల ప్రకారం పాయింట్లు ఎలా లెక్కిస్తారు?

మీరు ఆన్లైన్ రమ్మీ కార్డ్ గేమ్ ఆడుతున్నప్పుడు పాయింట్లను ఎలా లెక్కిస్తారో మనం ఇప్పుడు చూద్దాం.

కార్డులు విలువ
అధిక విలువలు కల కార్డులు ఆస్, కింగ్, క్వీన్, జాక్ అన్నీ 10 పాయింట్లు కలిగి ఉంటాయి
జోకర్ మరియు వైల్డ్ కార్డులు సున్న పాయింట్లు
ఇతర కార్డులు వాటి ముఖ విలువనే వాటి విలువగా కలిగి ఉంటాయి
ఉదాహరణ: 8 , 9 10 8 పాయింట్లు, 9 పాయింట్లు, 10 పాయింట్లు

ప్లేయర్ పాయింట్లు కోల్పోవుట

ఒక ప్యూర్ సీక్వెన్స్ తో కలిపి ఒక ప్లేయర్ 2 సీక్వెన్స్ లను కలిగి లేకపోతే గరిష్టంగా 80 పాయింట్లు వరకు అన్ని కార్డుల విలువ కలపబడుతుంది
ఒక ప్యూర్ సీక్వెన్స్ తో కలిపి ఒక ప్లేయర్ 2 సీక్వెన్స్ లను ఏర్పరచకపోతే సీక్వెన్సులో లేని కార్డుల విలువ లెక్కించబడుతుంది
తప్పుడు డిక్లరేషన్ 80 పాయింట్లు
మొదటి డ్రాప్ 20 పాయింట్లు
మిడిల్ డ్రాప్ 40 పాయింట్లు
వరుసగా మూడు తప్పితే 40 పాయింట్ల నష్టంలో మిడిల్ డ్డ్రాప్ గా పరిగణించబడుతుంది
టేబుల్ ను విడిచిపెట్టడం క్లోజ్డ్ డెక్ నుండి ఏరుకున్న తర్వాత ప్లేయర్ టేబుల్ ను విడిచిపెడితే, దానిని మిడిల్ డ్రాప్ గా పరిగణిస్తారు. ఒకవేళ ప్లేయర్ ఏ కార్డునూ ఏరుకోకపోతే, అది మొదటి డ్రాప్ గా పరిగణించబడుతుంది.

గెలుపు మొత్తంతో సహా పాయింట్ల గణనకు ఉదాహరణలు

ఉదాహరణ: 6 ప్లేయర్ల టేబుల్ (వైల్డ్ జోకర్ Q)

ప్లేయర్ ఏర్పడిన హ్యాండ్ లెక్కించిన పాయింట్స్
ప్లేయర్ 1 2 3 4 | 5♣ 6♣ Q | 8 8♠ 5♣ | 2 2♣ | K♠ Q♠ ప్లేయర్ 1 ప్యూర్ మరియు 1 ఇంప్యూర్ అనే 2 సీక్వెన్సులను కలిగి ఉన్నారు. కావున, కేవలం జతకాని కార్డుల పాయింట్లు మాత్రమే లెక్కించబడతాయి = 45
ప్లేయర్ 2 4♠ 4 4♣| 4 5 Q | 3♠ 7♠ 8♠ | Q K | 10♣ 9♣ ఒక ప్లేయర్ ఒక ప్యూర్ సీక్వెన్స్ తో కలిపి 2 సీక్వెన్స్ లను ఏర్పరచలేదు. కావున, అన్ని కార్డుల పాయింట్లు లెక్కించబడతాయి = 68
ప్లేయర్ 3 3 4 5 | 5♣ 6♣ 7♣ Q | 8 5♣ | 2 2♣ 2 | K♠ ప్లేయర్ 1 ప్యూర్ మరియు 1 ఇంప్యూర్ అనే 2 సీక్వెన్సులను కలిగి ఉన్నారు. ఇది 1 సైట్ ను కూడా ఏర్పరచింది. కేవలం గ్రూప్ చేయబడని కార్డులకు మాత్రమే పాయింట్లు లెక్కించబడతాయి = 23
ప్లేయర్ 4 A 4 5 | 5♣ 6♣ 10♣ J | 8 5♣ | 2 2♣ Q | K♠ 20 పాయింట్ల నష్టంతో మొదటి డ్రాప్
ప్లేయర్ 5 4♠ 4 4♣| 4 5 Q | A♠ 7♠ 8♠ | Q K | J♣ 9♣ వరుసగా మూడు తప్పారు = 40 పాయింట్లు
ప్లేయర్ 6 2 3 4 | 5♣ 6♣ 7♣ Q | 5 5♣ 5 | 2 2♣ 2 విజేత

రమ్మీ క్యాష్ గేమ్స్ లో మీ గెలుపులు ఎలా లెక్కించబడతాయి?

చివరకు ఇదంతా గెలుచుకున్న డబ్బును మీ ఖాతాలో పడేటట్లు చూడటం గురించే. మీ డాష్బోర్డ్ పై కనిపిస్తుున్న మొత్తాన్ని మీరెలా పొందుకుంటారో అనే దానిపై కూడా మీరు స్పష్టతను కలిగి ఉండాలి. నిజమైన డబ్బు కోసం ఆన్ లైన్ లో రమ్మీ ఆడండి కొరకు ఈ గణనలన్నీ ఎలా జరుగుతాయో మీరు అర్ధం చేసుకోవడంలో మమ్మల్ని మీకు సహాయపడనివ్వండి.

  • పాయింట్ల రమ్మీలో గెలుపును లెక్కించడం?

    మీరు పాయింట్ల రమ్మీ క్యాష్ గేమ్స్ ఆడేటప్పుడు, అది ముందుగానే నిర్ణయించబడిన రూపాయి విలువపై ఆధారపడి ఉంటుంది. గేమ్ చివర్లో గేమ్ లో విజేత ఇతర ఆటగాళ్ళు నష్టపోయిన క్యాష్ మొత్తాన్నంతటినీ గెలుచుకుంటారు. ఈ లెక్కింపు ఎలా జరుగుతుందో ఇక్కడ ఇవ్వబడింది.

    గెలుచుకునే మొత్తం = ( ప్రత్యర్ధుల పాయింట్ల మొత్తం) X ( పాయింటుకు రూపాయి విలువ) - రమ్మీసర్కిల్ ఫీజు

    దీన్ని మెరుగ్గా అర్ధం చేసుకోవడంలో మనకు సహాయపడటానికి ఇక్కడొక ఉదాహరణ ఇవ్వబడింది:

    ఉదాహరణ:

    మొత్తం 6 గురు ప్లేయర్లు పాయింట్స్ రమ్మీను రూ. 860 టేబుల్ కు ఆడుతున్నారు. ప్రతి పాయింటుకు ముందుగానే నిర్ణయించబడిన విలువ రూ. 4. ఇందులో ఒక్కరే విజేత అవుతారు కాగా మిగిలిన 5 గురు గేమ్ లో ఓడిపోతారు. మిగిలిన 5 గురు ప్లేయర్లు నష్టపోయిన పాయింట్లు వరుసగా 45, 78, 23, 20, 40. గెలుచుకున్న మొత్తాన్ని ఇలా లెక్కించవచ్చు:

    4x (45+78+23+20+40) = రూ. 824

    రమ్మీసర్కిల్ ఫీజును తీసివేసిన తర్వాత ఈ మొత్తం ప్లేయర్ ఖాతాలో చేరుతుంది.

  • పూల్ రమ్మీలో గెలుపును లెక్కించడం?

    పూల్స్ రమ్మీ కొరకు గెలుపు మొత్తం క్రింది విధంగా లెక్కించబడుతుంది:
    గెలుపు మొత్తం = (ఎంట్రీ ఫీజు) X (ప్లేయర్ల సంఖ్య) - రమ్మీ సర్కిల్ ఫీజు

    ఉదాహరణ:

    టోర్నమెంటుకు ప్లేయర్లు ఒక నిర్దిష్ట స్థిర మొత్తాన్ని ఎంట్రీ ఫీజుగా చెల్లిస్తారు, దీనిని బహుమతిని ఏర్పాటు చేయడానికి ఉపయోగిస్తారు. ఒక 5 గురు ప్లేయర్లు కలిసి పూల్ రమ్మీని రూ. 50 ఎంట్రీ ఫీజుతో ప్రారంభిస్తే ఆ గేమ్ యొక్క ప్రైజ్ పూల్ రూ. 250.

    ఇందులో విజేత రూ. 50 x 5 = రూ. 250 గెలుచుకుంటారు

    రమ్మీసర్కిల్ ఫీజు తీసివేసిన తర్వాత ఈ మొత్తం విజేత ఖాతాలో జమచేయబడుతుంది.

  • డీల్స్ రమ్మీలో గెలుపును లెక్కించడం?

    డీల్స్ రమ్మీలో డీల్ ముగింపు వద్ద విజేత అన్ని చిప్స్ గెలుచుకుంటారు. గెలుచుకినే మొత్తం ఎలా లెక్కించబడుతుందో ఇక్కడ ఇవ్వబడింది:

    గెలుపొందిన మొత్తం = ఒక్కొక్క చిప్ ను ఒక్కొక్క పాయింట్ గా ఊహిస్తూ ప్రత్యర్ధులందరి పాయింట్ల మొత్తం.

    ఉదాహరణ:

    ఒక టేబుల్ పై 6 గురు ప్లేయర్లు ఉండగా అందులో 5 వ ప్లేయర్ తన హ్హ్యాండ్ ను డిక్లేర్ చేసాడని అనుకుందాం. మిగిలిన నలుగురు ప్లేయర్లు వరుసగా 10, 20, 30, 35 మరియు 40 పాయింట్లతో ఓడిపోయరు. గెలుపొందిన వారికి వచ్చే చిప్స్ 10 + 20 + 30 + 35 + 40 =135 చిప్స్ గా లెక్కించబడతాయి.

పై మార్గదర్శని అంతటితో, సరియైన నిర్దేశకాలతో రమ్మీ ఆడటం మొదలుపెట్టి డబ్బును గెలుచుకోండి. రమ్మీ సర్కిల్ మీకు ఏ జంజాటము లేకుండా, గొప్ప అనుభవాన్ని ఆన్లైన్ రమ్మీతో పొందటానికి రమ్మీ గేమ్ డౌన్లోడ్ అవకాశాన్ని అందిస్తుంది. ఈ యాప్ ఆండ్రాయిడ్ మరియు IOS యూజర్లకు అందుబాటులో ఉంది. అంతేకాక మీరు మొబైల్ వెబ్ సైట్ పై ఎంతో వినోదాన్ని ఆస్వాదించవచ్చు.


మా సహాయ బృందాన్ని సంప్రదించండి

రమ్మీసర్కిల్ సహాయక బృందం మీకు ఉత్తమ రమ్మీ అనుభవంTM అందించడానికి 24x7 అందుబాటులో ఉంటారు. మా సహాయక బృందాన్ని మీ రిజిస్టర్ ఈమెయిల్ ఐడి ద్వారా info@ambarellabrandsecommerce.com వద్ద సంప్రదించి మీ సమస్యను లేదా ప్రశ్నను విన్నవించండి. మా ప్రతినిధి త్వరలో పరిష్కారంతో మీ వద్దకు వస్తారు.

Disclaimer: This game may be habit-forming or financially risky. Play responsibly.

 Back to Top